తెలంగాణ

telangana

ETV Bharat / state

'జాన్​పాడు ఉర్సు ఉత్సవంలో పాల్గొన్న హోంమంత్రి' - సూర్యాపేట జిల్లాలో జాన్​పాడు దర్గా

సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్​పాడు దర్గాలో ఉర్సు ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ, స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు.

ursu celebrations at janpahad dargah in suryapet district
'జాన్​పాడు ఉర్సు ఉత్సవంలో పాల్గొన్న హోంమంత్రి'

By

Published : Jan 24, 2020, 5:23 PM IST

'జాన్​పాడు ఉర్సు ఉత్సవంలో పాల్గొన్న హోంమంత్రి'

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఉర్సు ఉత్సవాలను సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్​పాడు దర్గాలో ఘనంగా నిర్వహించారు.

రాష్ట్ర హోం మంత్రి మహమూద్​ అలీ, స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి సంప్రదాయబద్ధంగా గంధం తీసుకువచ్చి మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలోని హజ్రత్​ సయ్యద్​ మోహినీ షా సమాధులతో పాటు బయట ఉన్న సైనిక బృందాల సమాధులను గంధం, పూలతో అలంకరించారు.

జాన్​పాడు దర్గాలో వచ్చే ఏడాది అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. రెండు మూడు నెలల్లో దర్గాకు మరోసారి వచ్చి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details