తెలంగాణ

telangana

ETV Bharat / state

Two Girls Died in Telangana Today : చెట్టుకొమ్మ పడి ఒకరు.. కారులో నుంచి తల బయటపెట్టి మరొకరు - సూర్యపేట క్రైమ్​ వార్తలు

Two Girls Died in Telangana Today : రాష్ట్రంలో ఇవాళ తొమ్మిదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు అసువులు బాసారు. చెట్టుకింద నిద్రిస్తున్న ఓ పాపపై కొమ్మ పడటంతో అక్కడికక్కడే మృతి చెందగా.. కారు డ్రైవర్ అద్దం పైకి లేపగా.. కారు డోర్​లో నుంచి తల బయటపెట్టి చూస్తున్న మరో చిన్నారి ఊపిరి ఆగిపోయింది.

Two children
Two children

By

Published : May 23, 2023, 11:02 AM IST

Two Girls Died in Telangana Today : రాష్ట్రంలో ఈ ఒక్కరోజులోనే వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఒకరు ప్రమాదవశాత్తు చెట్టుకొమ్మ విరిగి మీద పడగా చనిపోగా.. మరో చిన్నారి డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల చెందింది. చిన్నారుల అకాల మరణంతో ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. నిండా పదేళ్లు కూడా రాకముందే తమ గారాల పట్టీలు కనుమూయడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Girl died after a tree branch fell on her in Hanamkonda : ఎండకాలం హాయిగా చెట్టు కింద పడుకుందామని వెళ్లింది ఆ బాలిక. తన తల్లితో కలిసి హాయిగా చెట్టు కింద నిద్రిస్తోంది. రేపటి గురించి ఎన్నో కలలు కంటూ హాయిగా నిద్రిస్తున్న ఆ చిన్నారికి అదే ఆఖరి నిద్ర అవుతుందని తెలియదు. చెట్టు కొమ్మ విరిగి మీద పడటంతో ఆ చిన్నారి నిద్రలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారం.. హనుమకొండలోని ఐనవోలు మండలం నందనం గ్రామంలో కన్న శ్రీజ అనే 9 సంవత్సరాల బాలిక వేప చెట్టు కింద తన తల్లితో కలిసి సోమవారం రాత్రి నిద్రిస్తోంది. గాలి ఎక్కువ ఉండడంతో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కొమ్మ విరిగి శ్రీజపై పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కొమ్మ కింద పడటంతో పక్కనే ఉన్న తల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. తన పక్కనే నిద్రిస్తున్న కూతురు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాకైంది. అప్పటికే బాలిక మృతి చెందడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది.

Girl died after her neck stuck in a car window in Suryapet : మరో ఘటనలో పెళ్లికి వెళ్లిన చిన్నారి ఇంటికి శవంగా తిరిగొచ్చింది. అప్పటిదాకా పెళ్లిలో జరుగుతున్న బరాత్​ డ్యాన్సులు చూస్తూ కేరింతలు కొట్టిన ఆ చిన్నారి.. కారు డ్రైవరు నిర్లక్ష్యంతో మృతి చెందింది. ఈ దుర్ఘటన సూర్యాపేట జిల్లాలోని అనంతగిరి మండలం బొజ్జగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం...గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి బంధువుల పెళ్లికి వెళ్లింది బాణోతు ఇంద్రజ(9) అనే బాలిక .పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్న కారు వెనుక సీటులో ఒంటరిగా కూర్చుంది. కారు కిటీకీలో నుంచి తల బయట పెట్టి బరాత్​లో వేసే డ్యాన్సులు చూస్తోంది. ఇదే సమయంలో కారు డ్రైవరు.. చిన్నారిని గమనించకుండా డోర్‌ అద్దం బటన్‌ నొక్కాడు. చిన్నారి మెడ అందులో ఇరుక్కు పోయి ఊపిరాడక ఇంద్రజ మృతి చెందింది. ఈ ఘటనతో పెళ్లి వేడుకల్లో ఆనందంగా గడుపుతున్న వారందరు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. బొజ్జగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి తండ్రి బాణోతు వెంకటేశ్వర్లు డ్రైవర్​పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details