ఆరుగాలం పండించిన పంటను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి బూడిద చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచనపల్లిలో జరిగింది.
'వ్యక్తిగత కక్షతోనే పంటను కాల్చి బూడిద చేశారు' - మాచనపల్లిలో పంట దగ్ధం
తన పంటను వ్యక్తిగత కక్షతోనే కాల్చిబూడిద చేసినట్లు సూర్యాపేట జిల్లా మాచనపల్లికి చెందిన పనునూటి లింగయ్య ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.
'వ్యక్తిగత కక్షతోనే పంటను కాలిబూడిద చేశారు'
గ్రామానికి చెందన పసునూటి లింగయ్య.. తన పొలంలో 30 క్వింటాళ్ల ధాన్యంతోపాటు రెండెకరాల గడ్డివామును నిల్వచేశాడు. పంటనంతా మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టినట్లు తెలిపారు. ఇందుకు వ్యక్తిగత కక్షలే కారణమన్నారు. తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
ఇవీచూడండి:భారత్ బంద్‌ను విజయవంతం చేసిన విపక్షాలు