సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని పీహెచ్‌సీ ప్రభుత్వాసుపత్రిని, నూతనకల్, అర్వపల్లి ప్రభుత్వాసుపత్రులను ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సందర్శించారు. రెండో దశ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో 12 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు కోసం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ టెస్టుల విషయంలో ఆలస్యం వహించకూడదని.. నిర్ధరణ అయిన వ్యక్తులకు తక్షణమే కరోనా కిట్ అందించాలని తెలిపారు. తుంగతుర్తి ఆసుపత్రిలో తొందరలోనే 12 ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.
తుంగతుర్తి పీహెచ్‌సీకి త్వరలో 12 ఆక్సిజన్ బెడ్లు - telangana news updates
సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి పీహెచ్‌సీని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సందర్శించారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుంగతుర్తి పీహెచ్‌సీకి త్వరలో 12 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.
Tungaturti PHC will soon have 12 oxygen beds
ప్రస్తుతం కరోనా బాధితులు సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి వెళ్తుండటం వల్ల అక్కడ ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. అందుకే ఇక్కడే ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసుకుంటే.. చికిత్స ఇక్కడే తీసుకోవచ్చని అన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి.. అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు.