తెదేపా తరఫున హుజూర్నగర్ ఉపఎన్నిక పోరులో చావ కిరణ్మయి దిగుతున్నారు. తొలి నుంచి తెదేపాలోనే కొనసాగుతున్న కిరణ్మయికి... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి-ఫామ్ ఇచ్చారు. స్థానికురాలిగా హుజూర్నగర్ ప్రజల కష్టాల్లో ఎప్పుడూ తోడుగా ఉన్నానంటున్న కిరణ్మయి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హుజూర్నగర్లో తన గెలుపుతోనే రాష్ట్రంలో తెదేపా పునర్వైభవానికి శ్రీకారం చుడతామంటున్న చావ కిరణ్మయితో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్యకృష్ణ ముఖాముఖి...
'హుజూర్నగర్లో గెలుపే తెదేపా పునర్వైభవానికి శ్రీకారం' - HUZURNAGAR BY ELECTIONS UPDATES
"స్థానికురాలిగా హుజూర్నగర్ ప్రజల కష్టాల్లో తోడుగా ఉన్నా. తెదేపా హయంలో ఎన్నో అభివృద్ధి పనులు నియోజకవర్గంలో జరిపించాం. గతంలో జరిగిన ఎన్నికల్లో ఇతర పార్టీలకు మద్దతుగా పనిచేశాం. ప్రజల మనసులో తెదేపా ఇప్పటికీ పదిలంగా ఉందని గెలుపుతో నిరుపిస్తాం"- చావ కిరణ్మయి, తెదేపా అభ్యర్థి
TTDP CANDIDATE KIRANMAI CONFIDENT ABOUT TDP VICTORY IN HUZURNAGAR BY ELECTIONS