ఆర్టీసీ రాష్ట్ర బంద్‌లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు కార్మికులు, ప్రతిపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి. బస్సులను డిపో నుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. జిల్లాలోని సూర్యాపేట, కోదాడ డిపోల్లో మొత్తం 222 బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. ఆర్టీసీ సమ్మెకు వివిధ ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. పట్టణంలోని వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, తదితర వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.
సూర్యాపేట బస్సు డిపో ముందు కార్మికుల ధర్నా
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు, ప్రతిపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి.
సూర్యాపేట బస్సు డిపో ముందు కార్మికుల ధర్నా
TAGGED:
TSRTC WORKERS STRIKE