తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 43వ రోజుకు చేరుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్టీసీ ఐకాస తలపెట్టిన బస్ రోకో కార్యక్రమానికి వెళ్తున్న కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. తాము ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా సమ్మె నిర్వహిస్తుంటే పోలీసులు ఇష్టారీతిన అదుపులోకి తీసుకుంటున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోదాడలో బస్ రోకోకు వెళ్తున్న ఆర్టీసీ కార్మికుల అరెస్ట్ - tsrtc employees going to bus roko at kodad were arrested
సూర్యాపేట జిల్లా కోదాడలో బస్ రోకో కార్యాక్రమానికి వెళ్తున్న ఆర్టీసీ కార్మికులను, వామపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కోదాడలో బస్ రోకోకు వెళ్తున్న ఆర్టీసీ కార్మికుల అరెస్ట్