తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టభద్రుల ఎన్నికపై హుజూర్​నగర్​లో తెరాస సన్నాహక సమావేశం

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో పట్టభద్రుల ఎన్నికపై తెరాస సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ మేరకు పార్టీ ముఖ్య కార్యకర్తలతో ప్రధాన కార్యదర్శి రవీందర్, ఎమ్మెల్యే సైదిరెడ్డి సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు.

By

Published : Sep 20, 2020, 2:13 PM IST

పట్టభద్రుల ఎన్నికపై హుజూర్​నగర్​లో తెరాస సన్నాహక సమావేశం
పట్టభద్రుల ఎన్నికపై హుజూర్​నగర్​లో తెరాస సన్నాహక సమావేశం

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. సమావేశంలో మండల, డివిజన్, గ్రామస్థాయి ఇన్​ఛార్జీలను నియమించారు.

ఓటు హక్కు గురించి చర్చ..

త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు గురించి చర్చలు జరిపారు. పట్టభద్ర యువతీ యువకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ సూచించారు.

లేకపోతే దరఖాస్తు చేయాలి..

యువతకు ఓటు ప్రాధాన్యత గురించి వివరించాలన్నారు. ఓటు హక్కు లేని వారు కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 2017 సంవత్సరం కంటే ముందు డిగ్రీ పాసైన వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు అర్హులని రవీందర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్​లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : భగ్గుమంటున్న ధరలు.. సామాన్యునికి కూర'గాయాలు'

ABOUT THE AUTHOR

...view details