తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్ అన్ని వర్గాలకు సమన్యాయం చేశారు' - ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం

కోదాడ పట్టణంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఘనంగా ప్రారంభించారు. కార్యకర్తలు చురుగ్గా పాల్గొని.. నమోదును విజయవంతంగా జరిపించాలని కోరారు.

TRS membership registration program launched by mla bollam mallaiah in kodad
'కేసీఆర్ అన్ని వర్గాలకు సమన్యాయం చేశారు'

By

Published : Feb 12, 2021, 7:21 PM IST

కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

సభ్యత్వ నమోదును విజయవంతంగా జరిపించాలని ఎమ్మెల్యే.. కార్యకర్తలకు సూచించారు. పార్టీ ప్రణాళికపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి:మళ్లీ సూర్యాపేటకు వస్తా.. : బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details