తితిదే ప్రత్యేక ఆహ్వానితులు సాముల రామిరెడ్డిని సన్మానించిన తెరాస నేత ఉమాకాంత్ - telangana varthalu
17:32 October 23
తితిదే ప్రత్యేక ఆహ్వానితులు సాముల రామిరెడ్డిని సన్మానించిన తెరాస నేత ఉమాకాంత్
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులు సాముల రామిరెడ్డిని ఆయన నివాసంలో తెరాస రాష్ట్ర నాయకులు రేటోజు ఉమాకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. సాముల రామిరెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా సేవలందిస్తున్నారు.
ఇటీవలే ఆయనకు తితిదే పాలకమండలి కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏపీ ప్రభుత్వం నియమించింది. సాముల రామిరెడ్డికి ఆ కమిటీలో స్థానం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని తెరాస నాయకులు రేటోజు ఉమాకాంత్ అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి రామిరెడ్డి అత్యంత సన్నిహితుడు. వైఎస్ కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం ఉన్న రామిరెడ్డి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా పేరుగాంచారు.
ఇదీ చదవండి: Bathukamma on burj Khalifa: విశ్వవేదికపై బతుకమ్మ సంబురం.. దుబాయ్ చేరుకున్న కవిత