సూర్యాపేట జిల్లాలో తెరాస ఆవిర్భావ వేడుకలు - trs formation day Celebrations
సూర్యాపేట జిల్లాలో తెరాస ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్ సామేల్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
తెరాస
సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి.. రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్ సామేల్ నివాళులర్పించారు. తెలంగాణ పోరాటంలో అలుపెరగని ఉద్యమం చేసిన నాయకులకు కండువా కప్పారు. ఆనాడు ఆంధ్రా పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారిందని... ఈరోజు రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు. కేసీఆర్ కృషి కాళేశ్వర జలాలతో రాష్ట్రం పచ్చగా మారిందని అన్నారు. పేదప్రజలను ఆదుకున్న ప్రభుత్వం కేవలం తెరాస అని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి:పది రెట్లు ధర పెంచి కరోనా మందుల అమ్మకం..!