తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెరాస సర్కార్ ముందుకెళ్తోంది : పల్లా

తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్.. ఇప్పటివరకు లక్షా 30వేల ప్రభుత్వ ఉద్యోగాలు, 2 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలను కల్పించిందని నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ప్రచారం నిర్వహించారు.

palla-rajeshwar-reddy-campaign-for-graduate-mlc-election-2021
ఎమ్మెల్సీ ప్రచారంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి

By

Published : Mar 2, 2021, 10:04 AM IST

స్వయం ఉపాధి కింద నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ సాయం అందించిందని నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డి తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతే.. ఉద్యోగులకు పీఆర్సీ రూపంలో లాభం చేకూరుతోందని వెల్లడించారు.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పర్యటించిన పల్లా.. ఉదయపు నడకకు వెళ్లే వారితో మాట్లాడారు. మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి.. వాలీబాల్, షటిల్​ ఆడి పట్టభద్రులను ఉత్తేజ పరిచారు.

కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల నుంచి నడక మొదలు పెట్టి ప్రధాన రహదారులు తిరుగుతూ పట్టభద్రులను కలిశారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పల్లా అన్నారు.

ABOUT THE AUTHOR

...view details