సూర్యాపేట జిల్లా పాలకీడు, నేరేడుచర్ల మండలాల్లో తెరాస అభ్యర్థి తరఫున ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు. మిర్యాలగూడ, నకిరేకల్ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య ప్రచారంలో పాల్గొన్నారు. హుజూర్నగర్ అభివృద్ధి చెందాలంటే... తెరాస అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకులనే పట్టించుకోడు... ఇక ప్రజలను ఏం పట్టించుకుంటాడని ప్రశ్నించారు. ఈ ఎన్నిక అభివృద్ధికి, అభివృద్ధి నిరోధకులకు మధ్య యుద్ధంలాంటిదన్నారు. దళితులంతా తెరాసకు ఓటెయ్యాలని లింగయ్య కోరారు. ఎన్నికల్లో సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తాడని భాస్కర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
'భారీ ఆధిక్యంతో తెరాస అభ్యర్థి విజయం ఖాయం' - trs campaign in nereducharla
హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పని అయిపోయిందని ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య అన్నారు. తెరాస అభ్యర్థి తరఫున పాలకీడు, నేరేడుచర్ల మండలాల్లో ప్రచారం నిర్వహించారు.
'భారీ ఆధిక్యంతో తెరాస అభ్యర్థి విజయం ఖాయం'