కేంద్రం నిధులు లేకుండా... రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేస్తుందో చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస దొంగ ఓట్లు చేర్చింది: బండి
రాష్ట్రాన్ని తెరాస ప్రభుత్వం అప్పులపాలు చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. భాజపాను అడ్డుకునేందుకే దొంగఓట్లు చేర్చారని విమర్శించారు. సూర్యాపేటలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పాల్గొన్నారు.
bandi sanjay
పేదల పక్షాన భాజపా పోరాడుతుందని బండి సంజయ్ అన్నారు. ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. దొంగ ఓట్లతో తెరాస గెలవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి :త్వరలోనే 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: కేటీఆర్