గుంటూర్కు తరలివెళ్లిన ఏపీ మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన అభిమానులు వందలాదిగా తరలివచ్చారు. తమ అభిమాన నేతకు చివరిసారిగా నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్యశాఖ మంత్రిగా విధులు నిర్వహించిన కోడెల.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ ఆసుపత్రి నిర్మించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. కోడెల పార్థివదేహం వెంట వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపు ఆగిన బాబు.. కాన్వాయ్ నుంచే అభివాదం చేసి వెళ్లారు.
సూర్యాపేటలో కోడెల పార్థివదేహానికి నివాళులు - కోడెల శివప్రసాద్
ఏపీ మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన అభిమానులు వందలాదిగా తరలివచ్చారు. ఆయన పార్థివదేహాం వెంట వచ్చిన మాజీ సీఎం చంద్రబాబును కలవడానికి ఆయన అభిమానులు పోటిపడ్డారు.
కోడెల పార్థివదేహానికి నివాళులు