సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తెర సాంస్కృతిక కళా మండలి ఆధ్వర్యంలో గాన గంధర్వుడు, పద్మశ్రీ, పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకి ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్పీ బాలు పాడిన పాటలను పాడి ఆయనను గుర్తుచేసుకున్నారు.
గానగంధర్వుడికి నివాళి.. భారతరత్న ఇవ్వాలని డిమాండ్ - Demand to give Bharat Ratna to balasubramanyam
కోదాడ పట్టణంలో తెర సాంస్కృతిక కళా మండలి ఆధ్వర్యంలో ఎస్పీ బాలుకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీబీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గానగంధర్వుడికి నివాళి.. భారతరత్న ఇవ్వాలని డిమాండ్
ఆయన చిత్రపటానికి పూలమాలవేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. గానగంధర్వుడికి భారతరత్న ఇవ్వాలని తెర సాంస్కృతిక కళామండలి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంస్మరణ సభ కార్యక్రమానికి కోదాడ ప్రాంతానికి చెందిన పలువురు కవులు, కళాకారులు, రచయితలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:భవిష్యత్తులో హైస్కూల్ స్థాయిలోనే ఒకేషనల్ కోర్సులు: కిషన్రెడ్డి