సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు బదలాయించిన ఇద్దరు తహసీల్దార్లను సస్పెండ్ చేయడాన్ని హర్షిస్తూ... కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి చిత్రపటానికి గిరిజనులు పాలాభిషేకం చేశారు.
తహసీల్దార్లను సస్పెండ్ చేసినందుకు కలెక్టర్‌కు పాలాభిషేకం - suryapet news
భూముల విషయంలో అవినీతికి పాల్పడిన ఇద్దరు తహసీల్దార్లను సస్పెండ్ చేసిన కలెక్టర్ చిత్రపటానికి గిరిజనులు పాలాభిషేకం చేశారు. 50 ఏళ్ల నుంచి ఉన్న సమస్యను వారం రోజుల్లో పరిష్కరించిన కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
![తహసీల్దార్లను సస్పెండ్ చేసినందుకు కలెక్టర్‌కు పాలాభిషేకం tribals convay thanks to collector vinay krishna reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8530084-1093-8530084-1598194370140.jpg)
తహసీల్దార్లను సస్పెండ్ చేసినందుకు కలెక్టర్‌కు పాలాభిషేకం
50 ఏళ్ల నుంచి ఉన్న సమస్యను వారం రోజుల్లో పరిష్కరించిన కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. గిరిజన భూములను అక్రమంగా లాక్కొని తమను దౌర్జన్యంగా కొట్టిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 540 సర్వే నెంబర్లు పూర్తి సర్వే చేసి అర్హులైన గిరిజనులకు పట్టాలు ఇప్పించాలని జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు.