తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు.. రెండు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ - ఉప్పొంగిన కోడూరు చెరువు

పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా… సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వాగుపై వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు.. రెండు గ్రామాల మధ్య రాకపోకలు బంద్
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు.. రెండు గ్రామాల మధ్య రాకపోకలు బంద్

By

Published : Aug 20, 2020, 7:31 PM IST

సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కొమ్మాల నుంచి తుంగతుర్తికి వెళ్లే దారిలో… కోడూరు చెరువు నిండి అలుగు పోస్తోంది. దీనికి తోడు రహదారికి అడ్డంగా సంఘం వాగులో ఉద్ధృతంగా వరద ప్రవహిండం వల్ల ప్రమాదకరంగా మారింది. ఇక్కడ వంతెన నిర్మించాలని గ్రామస్తులు ఎంతో కాలంగా కోరుతున్నారు.

ప్రతి సంవత్సరం వాగు అధికంగా ప్రవహించడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ వంతెన నిర్మంచాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details