తెలంగాణ

telangana

ETV Bharat / state

'ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. ప్రమాదాల నుంచి తప్పించుకోండి' - Suryapet District Latest News

సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్ రోడ్ వద్ద 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ఇంఛార్జ్ రవాణా అధికారి సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ అంశాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. వినూత్న రీతిలో పుష్పగుచ్చాలు, స్వీట్లు పంపిణీ చేశారు.

Awareness of motorists on road safety and traffic issues
రోడ్డు భద్రత, ట్రాఫిక్ అంశాలపై వాహనదారులకు అవగాహన

By

Published : Jan 27, 2021, 1:53 PM IST

సీటు బెల్టు, హెల్మెట్ ధరించని ప్రయాణం ప్రమాదకరమని సూర్యాపేట జిల్లా ఇంఛార్జ్ రవాణా అధికారి సుభాష్ అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్​రోడ్ వద్ద 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ అంశాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు.

ప్రతి వాహనదారుడుకి పుష్పగుచ్చాలు, స్వీట్లు అందించి అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతలో భాగంగా 65వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు భద్రతా మాసోత్సవాలు చేపట్టినట్లు రవాణా అధికారి సుభాష్ తెలిపారు.

ఇదీ చూడండి:దూసుకెళ్తున్న మహిళా కానిస్టేబుళ్లు.. 'షి పాహి'లో అనుష్క

ABOUT THE AUTHOR

...view details