కొవిడ్ ఉద్ధృతి తగ్గుతుండడంతో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు లాక్ డౌన్ సడలింపు ఇచ్చినప్పటికీ రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు కచ్చితంగా ఈ-పాస్ కలిగి ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారు.
సరిహద్దు వద్ద రద్దీ... ఈ-పాస్ ఉంటేనే అనుమతి - telangana news
రాష్ట్ర సరిహద్దులోని చెక్ పోస్ట్‌ల వద్ద వాహనాల రద్దీ నెలకొంది. వీకెండ్ కావడంతో అధిక సంఖ్యలో వస్తున్న వాహనాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ-పాస్ ఉన్న వాటికి మాత్రమే అనుమతిస్తూ... లేని వాహనాలను తిప్పి పంపుతున్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తాకిడి అధికం కావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ పాస్ ఉన్న వాటిని మాత్రమే అనుమతిస్తున్నామని ఎస్సై సైదులు తెలియజేసారు. ఈ-పాస్ లేని వాహనాలను తిప్పి పంపుతున్నామని పేర్కొన్నారు. గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు చేసేదేమిలేక వెనుదిరిగి వెళ్తున్నారు. వారాంతం కావడంతో అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో చెక్ పోస్ట్‌ల వద్ద రద్దీ నెలకొంది.
ఇదీ చదవండి:సైకిల్ దిగి కారెక్కనున్న ఎల్.రమణ... రేపు వెల్లడించే అవకాశం