సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరు వద్ద ప్రమాదం జరిగింది. కూలీలతో వస్తున్న ట్రాక్టర్ బోల్తాపడింది. ముక్కుడు దేవులపల్లికి చెందిన 32 మంది కూలీలు నూతనకల్ మండలం మాచినపల్లిలోని మిరపతోటలకు కూలీకి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఏపూర్ వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన మరో ట్రాక్టర్ ఢీకొనగా... కూలీలతో ఉన్న ట్రాక్టర్ బోల్తాకొట్టింది.
కూలీల ట్రాక్టర్ బోల్తా... ఒకరు మృతి, 16 మందికి తీవ్రగాయాలు - CRIME NEWS IN SURYAPET
మిరపతోటల్లో పనికి వెళ్లి వస్తున్న కూలీల ట్రాక్టర్ సూర్యాపేట ఏపూర్ వద్ద బోల్తాపడింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 32 మంది కూలీలుండగా... ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మరో 16 మందికి తీవ్రగాయాలు కాగా... వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
![కూలీల ట్రాక్టర్ బోల్తా... ఒకరు మృతి, 16 మందికి తీవ్రగాయాలు TRACTOR OVER TURNED... ONE DIED, 16 INJURED](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5961260-thumbnail-3x2-ppp.jpg)
TRACTOR OVER TURNED... ONE DIED, 16 INJURED
ప్రమాదంలో బయ్య లింగమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో 16 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
కూలీల ట్రాక్టర్ బోల్తా... ఒకరు మృతి, 16 మందికి తీవ్రగాయాలు