తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక మహిళపై 700 మంది రాజకీయం: ఉత్తమ్​ - కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి

ఒక మహిళపై 700 మంది నాయకులు రాజకీయం చేస్తున్నారని ఉత్తమ్​ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కందిబండలో కాంగ్రెస్​ అభ్యర్థి పద్మావతి రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు.

ఒక మహిళపై 700 మంది రాజకీయం: ఉత్తమ్​

By

Published : Oct 14, 2019, 8:19 PM IST

ఒక మహిళపై 700 మంది రాజకీయం: ఉత్తమ్​
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డిని గెలిపించాలని కోరారు. 1994 నుంచి తాను గెలిచినా, ఓడినా.. అధికారంలో ఉన్నట్లుగా హుజూర్​నగర్​ను అభివృద్ధి చేశానని తెలిపారు. 3 వేల 500 కోట్లతో విద్య, వైద్యం, రవాణా ప్రాజెక్టులు ఏర్పాటు చేశానన్నారు. ఒక మహిళ అని చూడకుండా 700 మంది నాయకులు అక్కడ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఉత్తమ్​ విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details