తెలంగాణ

telangana

ETV Bharat / state

'బాధలో ఉన్న వారిపై మంత్రుల విమర్శలా...?' - తెరాస మంత్రులపై ఉత్తమ్​ విమర్శలు

ఇప్పటికే ఎంతో బాధతో కుమిలిపోతున్న ఆర్టీసీ కార్మికులపై మంత్రులు విమర్శలు చేయటం సిగ్గుచేటని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉత్తమ్​ మద్దతు తెలుపుతూ... ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

TPCC CHIEF UTTAM KUMAR REDDY COMMENTS ON TRS MINISTERS ABOUT TSRTC EMPLOYEES

By

Published : Oct 16, 2019, 10:23 PM IST

యాభైవేల మంది ఆర్టీసీ కార్మికులు వారి కుంటుంబాలను రోడ్డుపై పడేసిన దుర్మార్గుడు సీఎం కేసీఆర్ అని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడ డిపోలోని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. తెరాసకు బుద్ధి చెప్పాలన్నా... ఆ పార్టీని ఓడించాలన్నా కార్మికుల వల్లే అవుతుందని పేర్కొన్నారు. హుజూర్​నగర్​లో అధికార పార్టీ నేతలు డబ్బు, మద్యాన్ని ఏరులుగా పారిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీని ముందు నుంచే నిర్లక్ష్యం చేస్తూ... పథకం ప్రకారమే ఎండీని నియమించలేదని ధ్వజమెత్తాడు. హైకోర్టు మొట్టికాయలు వేసినా... ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో లాభాల్లో ఉన్న ఆర్టీసీని తెరాస ప్రభుత్వం నష్టాల్లోకి నెట్టిందని ఉత్తమ్​ మండిపడ్డారు.

'బాధలో ఉన్న వారిపై మంత్రుల విమర్శలా...?'

ABOUT THE AUTHOR

...view details