హుజూర్నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డిని ఓడించడానికి 700 మంది తెరాస వాళ్లు వచ్చారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పద్మావతి రెడ్డి 30వేల మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గెలవక పోతే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని చెప్పారు. హుజూర్నగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తన కృషి వల్లే హుజూర్నగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని తెలిపారు. దేశంలో ఏ నియోజకవర్గానికి దక్కని నిధులు హుజూర్‌నగర్‌కు తెచ్చానని పేర్కొన్నారు.
పద్మావతి గెలవకపోతే ఏ శిక్షకైనా సిద్ధమే..: ఉత్తమ్ - uttam on huzurnagar
పోలీసులను అడ్డుపెట్టుకుని తెరాస గెలవాలని ప్రయత్నిస్తోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తమ అభ్యర్థి పద్మావతి రెడ్డి 30వేల మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
UTTAM KUMAR REDDY
Last Updated : Sep 30, 2019, 9:34 PM IST