Temperature in TS: రాష్ట్రంలో భానుడు భగభగలు ఇంకా తగ్గడం లేదు. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లలేక ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. తాజాగా సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోని పలు మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇలా..:సూర్యాపేట జిల్లా మునగాల, ఖమ్మం జిల్లా మధిర, చింతకాని, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలాల్లో అత్యధికంగా 44.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలోని రావినూతలలోనూ 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది.