సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎంఎస్ కళాశాలల్లో తెజస పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నియోజకవర్గ పట్టభద్రులతో, ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు గట్టి ఎదురుదెబ్బ తగలబోతుందని జోస్యం చెప్పారు.
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెపుతాం' - Warangal, Khammam and Nalgonda districts graduate MLC election
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెరాస పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగలబోతుందని తెజస పార్టీ అధ్యక్షుడు కోదండరాం జోస్యం చెప్పారు. పట్టభద్రులు ఆలోచించి ప్రశ్నించే గొంతుకను మండలికి పంపించాలని విజ్ఞప్తి చేశారు.

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెపుతాం'
ఈ ఎన్నికలు నిరంకుశత్వనికి, ప్రజాస్వామ్యనికి మధ్య జరగబోయే యుద్ధంగా అభివర్ణించారు. ఒక నియంతలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు త్వరలోనే వస్తుందని పేర్కొన్నారు. సాధించి తెచ్చుకున్న తెలంగాణ రాష్టంలో ఏ ఒక్కరికి న్యాయం జరరగలేదన్నారు. పట్టభద్రులు ఆలోచించి ప్రశ్నించే గొంతుకను మండలికి పంపించాలని కోదండరామ్ విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి:రూ.కోటి హవాలా డబ్బు పట్టివేత.. ఆ పార్టీ నేతదేనట..!