తెలంగాణ

telangana

ETV Bharat / state

'నష్టాల నుంచి గట్టెక్కాలంటే విలీనం ఒక్కటే మార్గం'

సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రజాప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఆర్టీసీ సంస్థను కేసీఆర్ ప్రభుత్వమే అప్పులపాలు చేసిందని విమర్శించారు.​

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 2019

By

Published : Oct 17, 2019, 3:28 PM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 2019

నష్టాల నుంచి ఆర్టీసీ బయటపడాలంటే విలీనం ఒక్కటే మార్గం అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ... జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు సమ్మె నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు. సమ్మె నోటీసులు ఇచ్చి రెండు నెలలు ఎదురు చూసినా.. ప్రభుత్వం స్పందించకుండాఅహంకార పూరితంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఏకపక్ష నిర్ణయాలతో మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా గుణపాఠం చెప్పాలన్నారు. సమ్మెపై చర్చలు జరపాలని హైకోర్టు సూచించినా.. ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details