తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలి'

తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుమార్​ అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మున్సిపాలిటీ అర్బన్​ నర్సరీని ప్రారంభించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని సూచించారు.

By

Published : Jun 26, 2020, 6:06 PM IST

thungathurthy mla gadari kishore participated in harithaharam programme in suryapet district
'నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలి'

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిశోర్​కుమార్ మున్సిపాలిటీ అర్బన్ నర్సరీని ప్రారంభించి ఆరో విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాస్కులు పంపిణీ చేశారు. తెలంగాణలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్​ తరాలను దృష్టిలో పెట్టుకొని హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారని అన్నారు.

తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా హరితహారంలో భాగంగా గ్రామాల్లో, పట్టణాల్లో చెట్లను నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు సూచించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలన్నారు. హరితహారానికి ప్రత్యేక బడ్జెట్​ కూడా కేటాయించామని ఎమ్మెల్యే తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 శాతం మాత్రమే అటవీ శాతం ఉందని.. కావున మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 కోట్ల మెుక్కలను నాటాలని సీఎం కేసీఆర్​ దృఢసంకల్పంతో ఉన్నారని వెల్లడించారు. ప్రతి గ్రామపంచాయతీలో రోడ్లకు ఇరుపక్కల చెట్లను నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్​ పర్సన్ పోతరాజు రజిని రాజశేఖర్, వైస్ ఛైర్మన్ రఘునందన్ రెడ్డి, ఎంపీపీ నెమరు గొమ్ముల స్నేహలత, జడ్పీటీసీ దుప్పటి అంజలి రవీందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: అడవులు లేకుంటే అంతే సంగతి: హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details