సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామంలో చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ముగ్గురు అమ్మాయిలకు... తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్ లక్షా 50వేలు ప్రకటించి దాతృత్వం చాటుకున్నారు. తిరుమలగిరిలోని తన నివాసంలో చిన్నారులకు ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు అందించారు. తల్లిదండ్రులు లేని జీవితం ఊహించుకుంటేనే బాధగా ఉందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఏ అవసరం వచ్చినా తాను చిన్నారులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే దాతృత్వం.. ముగ్గురు చిన్నారులకు ఆర్థికసాయం - ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ దాతృత్వం
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులకు... తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆర్థిక సాయం అందజేశారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథైన.. ఈ చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సంబంధిత పత్రాలను అందించారు.
మద్దిరాల మండలం ముకుందాపురంలోని నిరుపేద దళిత కుటుంబానికి చెందిన మీసాల పరుశరాములు ఇటీవల మృతి చెందారు. పరుశరాములు భార్య గతంలోనే మృతి చెందింది. దీంతో వారి కూతుళ్లు సాద, నవ్య, దివ్య అనాథలుగా మారారు. తల్లిదండ్రులను కోల్పోయి ముగ్గురు చిన్నారులు అనాధలుగా మారిన విషయం తెలుసుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఫిక్స్డ డిపాడిట్ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనోధైర్యం కల్పించిన కిషోర్ కుమార్కు మద్దిరాల మండల ప్రజలు కృతజ్ఞతలుతెలిపారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ ఎస్ఏ రజాక్, జడ్పీటీసీ సభ్యుడు కన్నా సూరంభ వీరన్న, వైస్ ఎంపీపీ శ్రీరాం రెడ్డి, అక్కిరెడ్డి జ్యోతి, మద్దిరాల ఉపసర్పంచ్ శేరి మధుసూధన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు వడ్డాణం మధు సూధన్, గూడ వెంకట్ రెడ్డి, కొలగాని వెంకన్న, బీ యస్ ముదిరాజ్, చామకూరి మల్లయ్య, మాల్యాల రామూర్తి, మురగుండ్ల సోమయ్య, కోమరయ్య, కోడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.