తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎమ్మెల్యే గాదరి - latest news on

ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను అందజేశారు.

thungathurthi mla gadari kishor kumar distributed tractors
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎమ్మెల్యే గాదరి

By

Published : Mar 12, 2020, 10:11 AM IST

పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందిస్తోందని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్‌ కుమార్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నాగారంలో పేరబోయిన గూడెం, శాంతినగర్, లక్ష్మీపురం గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు.

గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య సమస్య పరిష్కరించడంలో ట్రాక్టర్ల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎమ్మెల్యే గాదరి

ఇదీ చూడండి:భాజపా రాష్ట్ర సారథిగా సంజయ్​నే ఎందుకు నియమించారంటే?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details