ఈటీవీ భారత్ కథనానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ స్పందించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న గైగుళ్ల శోభారాణి దీన గాథపై ఈటీవీ భారత్ 'అమ్మకే అమ్మయిన చిన్నారి' కథనాన్ని ప్రసారం చేసింది. ఈ చిన్నారి తండ్రి శ్రీనివాస్ రెండేళ్ల కిందట జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లి మానసిక వికలాంగురాలు. శ్రీనివాస్ మరణం ఆ కుటుంబాన్ని కష్టాల సుడిగుండంలోకి నెట్టేసింది. ఓవైపు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతూనే... మరోవైపు నా అనేవాళ్లు లేకపోయినా మతిస్తిమితం లేని తల్లిని చంటి పిల్లలా సాకుతోంది శోభారాణి. సాయంత్రంపూట స్థానిక ప్రభుత్వ వసతి గృహంలో తను తిని తల్లికి కాసింతా తీసుకొచ్చి తినిపించేది. ఈ చిన్నారి జీవితంపై ఈటీవీ భారత్ ప్రసారం చేసిన కథనంపై స్థానిక శాసనసభ్యుడు కిశోర్ స్పందించి రూ.25 వేల ఆర్థికసాయం ప్రకటించారు. అలాగే తాత్కాలిక ఇంటి నిర్మాణంతోపాటు... భవిష్యత్తులో రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన తుంగతుర్తి ఎమ్మెల్యే - respond
ఈటీవీ భారత్ కథనానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ స్పందించారు. బాధిత కుటుంబానికి రూ.25 వేల ఆర్థికసాయం ప్రకటించారు.
Thunga thurthy MLA