బతుకుదెరువు కోసం రాష్ట్రం దాటి వచ్చారు ఆ దంపతులు. చంటిబిడ్డతో సహా కూలీకి పోతూ కాలం వెల్లదీస్తున్నారు. చలికాలంలోనూ మూడు నెలల పాపాయిని తీసుకొని పత్తి, మిరుప తోటల్లో పనిచేస్తున్నారు. మూడు కర్రలతో ఏర్పాటు చేసిన ఊయలలో బోసి నవ్వులతో ఆడుకుంటున్న చిన్నారి... అమ్మ కోసం సాయంత్రం దాకా ఎదురు చూస్తూ ఆడుకోవడం స్థానికులని కలచివేస్తుంది.
కర్నూలు జిల్లాకు చెందిన కూలీలు ఉపాధి కోసం రెండు నెలల కిందట సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలానికి వచ్చారు. మండల పరిధిలో పత్తి, మిరుప తోటల్లో కూలీకి పోతూ... కాలం వెల్లదీస్తున్నారు. వారిలో జ్యోతి, గంగాధర్ దంపతులకు మూడు నెలల పసిపాప ఉంది. బతుకుదెరువు కోసం వచ్చిన ఆ దంపతులు తప్పని పరిస్థితుల్లో చిన్నారిని తోటలకు తీసుకెళ్తున్నారు. పొలంలో మూడు కర్రల సాయంతో ఊయల ఏర్పాటు చేసి పనులు చేసుకుంటున్నారు.