కరోనా వైరస్ దృష్ట్యా సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామస్థులు సోమవారం ఒక స్వచ్ఛంద నిర్ణయానికి వచ్చారు. తమ గ్రామంలోకి ఏ ఒక్క వాహనం కూడా రావొద్దని, గ్రామం నుంచి ఎవరు బయటకు వెళ్లొద్దని తీర్మాణం చేసుకున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై అడ్డంగా రాళ్లు వేసి వచ్చిపోయే వాహనాలను అడ్డుకున్నారు. లాక్డౌన్ పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వాహనదారులు సహకరించాలని గ్రామస్థులు కోరారు.
లాక్డౌన్ ఎఫెక్ట్: మా గ్రామంలోకి ఎవరూ రావొద్దు - రహదారికి అడ్డంగా రాళ్లు
సూర్యాపేట జిల్లా కూచిపూడి గ్రామస్థులు లాక్డౌన్లో భాగంగా గ్రామానికి రాకపోకలు నిలిపివేశారు. ప్రధాన రహదారికి అడ్డంగా రాళ్లు వేసి మా గ్రామానికి ఎవరూ రావద్దు అంటూ వాహనాలను అడ్డుకుంటున్నారు.
లాక్డౌన్ ఎఫెక్ట్: మా గ్రామంలోకి ఎవరూ రావొద్దు