తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేట్​ యూనివర్సిటీల బిల్లును రద్దు చేయాలంటూ పాదయాత్ర - march in suryapet for cancellation of Private Universities Bill

ప్రైవేట్​ యూనివర్సిటీల బిల్లును రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ మహాజన స్టూడెంట్​ యూనియన్​ ఆధ్వర్యంలో సూర్యాపేటలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

The march for cancellation of the Private Universities Bill
ప్రైవేట్​ యూనివర్సిటీల బిల్లును రద్దు చేయాలంటూ పాదయాత్ర

By

Published : Oct 5, 2020, 8:12 AM IST

రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును వెంటనే రద్దు చేయాలని మహాజన స్టూడెంట్ యూనియన్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూషిపాక గణేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని ఈటూరులో పాదయాత్ర చేపట్టారు. ఈటూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర మాచిరెడ్డిపల్లి, వర్ధమానుకోట గ్రామాల మీదుగా ఆదివారం నాగారం చేరుకుంది.

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏమాత్రం ఉపయోగం లేని ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని గణేశ్​ డిమాండ్​ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్​.ఎస్.ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొజ్జ సైదులు, నియోజకవర్గ ఇంఛార్జ్ తడకమల్ల రవి కుమార్, చిప్పలపల్లి సోమ శేఖర్, రాజేశ్, ప్రభాస్, భాను ప్రసాద్, ప్రవీన్, నవీన్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కాంక్రీట్‌ వేస్తుండగా కూలిన స్లాబ్.. పది మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details