మట్టి పోసి.. చెరువులు అన్యాక్రాంతం - చెరువుల ఆక్రమణ
గొలుసుకట్టు చెరువులను బాగు చేయాలని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించింది. ఇంతవరకూ బాగున్న కొంతమంది కబ్జాకోరులు భూమికి ఆనుకొని ఉన్న చెరువులో మట్టిపోసి వాటిని ఆక్రమించుకుంటున్నారు.

మట్టి పోసి.. చెరువులు అన్యాక్రాంతం
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం తాళ్లమల్కాపురంలోని గరుడ సముద్రం చెరువు ఆక్రమణకు గురైంది. ఈ విషయాన్ని కొత్తగూడెం గ్రామ ఎంపీటీసీ వెంకట్రెడ్డి అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించటం లేదని పేర్కొన్నారు. 340 ఎకరాలు ఉన్న ఈ చెరువు ప్రతి సంవత్సరం కొంతమేర ఆక్రమణకు గురువుతున్నట్లు స్థానికులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి చెరువును సర్వే చేయించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.