"మతసామరస్యానికి ప్రతీక.. తీజ్ పండుగ" - 'మతసామరస్యానికి చిహ్నంగా నిలిచే పండుగ తీజ్'
కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో తీజ్ పండుగను నిర్వహించారు. వేడుకల్లో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ కిట్స్ మహిళా కళాశాలలో తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, గౌరవ అతిథిగా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో తీజ్ పండుగను చేయడం హర్షణీయమని హరిప్రియనాయక్ తెలిపారు. మత సామరస్యానికి చిహ్నంగా నిలిచే పండుగా తీజ్ అని కొనియాడారు. కేసీఆర్ గిరిజనులకు పెద్దపీట వేస్తున్నారని.. గతంలో ఏ ప్రభుత్వం కూడా గిరిజనులను పట్టించుకోలేదని హరిప్రియ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను ఆదరిస్తోందని కోదాడ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.