తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్రవాహనంపై వెళ్లి రైతులను కలిసిన కలెక్టర్​ - సూర్యాపేట జిల్లా పాలనాధికారి వినయ్ కృష్ణారెడ్డి

రైతుల సమస్యలను తెలుసుకునేందుకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ద్విచక్రవాహనంపై వెళ్లారు. మునగాల మండల కేంద్రంలోని పొలాల వద్దకు చేరుకుని రైతుల కల్లాలను ఆయన పరిశీలించారు.

collector
ద్విచక్రవాహనంపై వెళ్లి రైతులను కలిసిన కలెక్టర్​

By

Published : Mar 18, 2021, 6:54 PM IST

రైతులను కలిసేందుకు సూర్యాపేట జిల్లా పాలనాధికారి వినయ్ కృష్ణారెడ్డి ద్విచక్రవాహనంపై వెళ్లారు. మునగాల మండల కేంద్రంలో పంటపొలాల మధ్య ఉండే రైతుల కల్లాలను పరిశీలించేందుకు బైక్​పై​ బయలుదేరారు.

పొలాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ద్విచక్రవాహనంపై రైతుల వద్దకు చేరుకుని కల్లాలను పరిశీలించారు. వారి సమస్యలను కలెక్టర్​ అడిగి తెలుసుకున్నారు. నేరుగా పొలాల్లోకి కలెక్టర్ రావడంతో రైతులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తర్వాత తిమ్మారెడ్డిగూడెం గ్రామంలోని పల్లె ప్రకృతివనం స్థలాన్ని ఆయన పరిశీలించారు.

ఇదీ చూడండి:'ఆడబిడ్డల తల్లిదండ్రుల కళ్లలో సంతృప్తే సర్కారుకు సార్థకత'

ABOUT THE AUTHOR

...view details