సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన అజయ్‌కి... ప్రకాశం జిల్లాకు చెందిన ఇంద్రజకు రెండ్రోజుల క్రితం వివాహం జరిగింది. అనంతరం పెళ్లి కుమార్తె బంధువులు బరాత్‌లో డీజే వద్దని... తాము త్వరగా వెళ్లాలని వరుడి బంధువులకు తెలిపారు. ఇంతలో మాటా మాటా పెరిగి ముష్టియుద్ధానికి దారితీసింది.
ఇరువర్గాల బంధువులు ఒకరినొకరు కొట్టుకున్నారు. కుర్చీలు ఎత్తి కొట్టుకున్నారు. యువకుల ఆవేశాన్ని చల్లార్చేందుకు బంధువర్గంలోని మహిళలు కాళికావతారం ఎత్తాల్సి వచ్చింది. చివరకు మహిళల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ముష్టియుద్ధం చేసిన వాళ్లు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఆవేశానికి పోయి నూతన వధూవరులను, ఇరు కుటుంబాలను ఇబ్బంది పెట్టారు.