సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలో ఈతకు వెళ్లి 10ఏళ్ల బాలుడు బావిలో మునిగి మృతి చెందాడు. తిమ్మాపురం గ్రామానికి చెందిన లింగరాజు, శైలజల కుమారుడు నగేశ్. గొర్రెలను తోలుకొని పొలం వద్దకు వెళ్లిన సమయంలో ఈఘటన చోటు చేసుకుంది.
'సూర్యాపేట జిల్లాలో ప్రాణం తీసిన ఈత సరదా' - A boy drowned in a well in Thimmapuram Village
ఈతరాక పోవడం వల్ల బాలుడు బావిలో మునిగి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలో జరిగింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన లింగరాజు, శైలజల కుమారుడు నగేశ్. ప్లాస్టిక్ బాటిల్‌ను నడుముకు కట్టుకొని బావిలో దూకడం వల్ల.. తాడుతెగి నీటిలో మునిగి అక్కడికక్కడే చనిపోయాడు.
'సూర్యాపేట జిల్లాలో ప్రాణం తీసిన ఈత సరదా'
ప్లాస్టిక్ బాటిల్ ను నడుముకు కట్టుకొని బావిలో దూకడం వల్ల.. తాడు అకస్మాత్తుగా తెగింది. ఈత రాక పోవడం వల్ల నగేశ్ నీటిలో మునిగి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. దీనిపై కేసు నమోదు చేసిన అర్వపల్లి పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:సీఎం కేసీఆర్‌కి రైతన్న బహుమానం
Last Updated : Jun 3, 2020, 7:33 AM IST