తెలంగాణ

telangana

ETV Bharat / state

హుజూర్​నగర్​లో ప్రశాంతంగా భారత్​ బంద్​ - bharat bandh in huzurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో భారత్​ బంద్​ ప్రశాంతంగా కొనసాగింది. అఖిల పక్షం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

bandh in huzur nagar
హుజూర్​నగర్​, భారత్​ బంద్​

By

Published : Mar 26, 2021, 1:42 PM IST

భారత్​ బంద్​కు మద్దతుగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానికులు బంద్​ను విజయవంతం చేశారు. ఇందిరా చౌక్​ సెంటర్​ వద్ద నాయకులు ర్యాలీ చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతు సంఘాలు చేస్తున్న దీక్షలకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. యాభయ్యేళ్ల వయసు పైబడిన రైతులు నాలుగు నెలల నుంచి ధర్నా చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

ఈ ధర్నాలో కార్మికులు, రైతు సంఘాలు పాల్గొన్నాయి. భారత్​బంద్​కు సహకరించిన ప్రజలందరికీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి:అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తల యత్నం..

ABOUT THE AUTHOR

...view details