సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. పట్టణ శివారులోని ఓ మామిడి తోటలో భల్లూకం ప్రవేశించింది. గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు ఎలుగుబంటిని పరిశీలించి అనారోగ్యంగా ఉందని చెప్పారు. దానిని పట్టుకొని సంరక్షణ కేంద్రాంనికి పంపేందుకు జూ అధికారుల అవసరం ఉందని తెలిపారు.
వెంటనే.. హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్క్ వారికి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయింది. అధికారుల సమన్వయం చేసుకోకపోవడం వల్లే.. ఎలుగుబంటి పారిపోయిందని స్థానికులు ఆరోపించారు. పట్టణంలో భల్లూకం సంచరిస్తుందన్న విషయం ప్రచారం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.