ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీ కొట్టిన ఘటనలో ఓవ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కృష్ణాజిల్లా ఈనాడు విలేకరి మృతి..
మృతుడు కృష్ణాజిల్లా వత్సవాయి మండలం మగ్గోలు గ్రామానికి చెందిన ఈనాడు విలేఖరి గోపీగా పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై బంధువుతో కలిసి పెళ్లికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు.