సూర్యాపేట జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల వరకు ఉత్సాహంగా సాగిన పోలింగ్ మధ్యాహ్నానికి మందగించింది. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడం వల్ల పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం తగ్గింది. మొత్తంగా 70 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
సూర్యాపేటలో ముగిసిన పార్లమెంటు పోరు - సూర్యాపేట పోలింగ్ సరళి
సూర్యాపేట నియోజకవర్గంలో 70 శాతం పోలింగ్ నమోదైంది. చెదురు మదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.
సూర్యాపేట పోలింగ్