తెలంగాణ

telangana

ETV Bharat / state

గుప్త నిధులు కావవి... రాగి నాణేలు...

రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న ఆశ మధ్యతరగతి వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది.. దొంగ బాబాలు, మోసగాళ్లు చెప్పే మాటలు విని ఆర్థికంగా నష్టపోతున్నారు. చివరకు దురాశకు పోయి ఉన్నదంతా పొగొట్టుకుని లబోదిబోమంటున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.

ఉన్నది పోయింది... ఉంచుకుంది పోయింది అంటే ఇదే

By

Published : Apr 17, 2019, 6:01 PM IST

Updated : Apr 17, 2019, 8:45 PM IST

మోసగాళ్ల మాయకు పరాకాష్ఠ...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం అమరవరంలోని ఓ వ్యక్తి ఇంట్లో 24 కిలోల పురాతన నాణేలు బయటపడ్డాయి. ఈ వార్త ఆనోట ఈనోట దావానలంలా వ్యాపించగా, సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు దాడి చేసి, అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు.

తవ్వకాల్లో నాణాలు...
అమరవరం గ్రామానికి చెందిన గురవారెడ్డి అనే వ్యక్తి, తన ఇంట్లో గుప్త నిధి ఉందని నమ్ముతుండేవాడు. వాటి కోసం ఓ దొంగబాబా సాయంతో మేకలను బలి ఇచ్చి, ప్రత్యేక పూజలు జరిపించాడు. అనంతరం తవ్వకాలు సాగించగా... 24 కిలోల బరువున్న నాణేల పాత్ర బయట పడింది. వాటిని బంగారు నాణేలుగా భావించి సంబరపడ్డాడు.

అప్పటికే గురవారెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు అకస్మాత్తుగా దాడిచేసి... నాణేలపాత్ర స్వాధీనం చేసుకుని,దొంగ బాబాతో పాటు ఇంట్లో వున్నవారందరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పూజలకోసం బాబాకు 10లక్షలు చెల్లించినట్లు సమాచారం.
నకిలీ నాణేలుగా తేల్చిన పోలీసులు
అయితే, అవి బంగారు నాణేలు కావని, రాగి, ఇత్తడి లోహ మిశ్రమాలతో తయారైన నకిలీ నాణేలని తేల్చారు. గుప్త నిధుల తవ్వకం ఘటనపై కేసు నమోదు చేసి, విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఉన్నది పోయింది... ఉంచుకుంది పోయింది అంటే ఇదే

ఇవీ చూడండి:అదనపు విధులు... ఆగుతున్న గుండెలు...

Last Updated : Apr 17, 2019, 8:45 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details