తెలంగాణ

telangana

ETV Bharat / state

పదోతరగతి విద్యార్థుల ప్రతిభకు పురస్కారం - gpa

ప్రభుత్వ పాఠశాలలో చదవుకొని పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థులను పురస్కారాలతో అభినందించింది విజయీభవ ట్రస్ట్.

విజయీభవ ట్రస్ట్

By

Published : Jun 9, 2019, 5:22 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ ప్రభుత్వ బాలుర పాఠశాలలో విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతిలో పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఎన్నారై జ్యోతిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థినిలు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. ప్రభుత్వ పాఠశాలలో పదికి పది జీపీఎస్ సాధించిన 120 మంది విద్యార్థులకు ఈ పురస్కారాలు దక్కాయి.

విజయీభవ ట్రస్ట్

ABOUT THE AUTHOR

...view details