Telangana Young Farmer Bhukya Bichu :ఉద్యోగం రాకుంటేనేం, ఊళ్లో ఉండి నలుగురికి ఉపాధి కల్పించే ఉపాయం ఉందనుకున్నాడు ఈ యువకుడు. వినూత్నంగా ఆలోచించి వైవిధ్యభరితమైన వ్యవసాయమార్గం ఎంచుకున్నాడు. సాంకేతికత ఉపయోగించి సాగు చేస్తూ ఏటా మంచి ఆదాయం అందుకుంటున్నాడు. ఫలితంగా ప్రభుత్వ దృష్టిని ఆకర్షించి ఉత్తమ మిలియనీర్ రైతు అవార్డు అందుకున్నాడు.
Donkey Farm : గాడిదల ఫామ్.. తెలంగాణలో తొలిసారి.. ఐడియా అదిరిందిగా..
సూర్యాపేట(Suryapet) జిల్లా తిరుమలగిరి మండలం తుమ్మలకుంట తండాకు చెందిన ఇతడు భూక్యా బీచ్చు. 2012లో బీటెక్ బయోటెక్నాలజీ పూర్తి చేశాడు. 2018 వరకు ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. కానీ ఫలితం లేదు. ఉద్యోగం రాలేదని దిగులు చెందకుండా సాగు రంగం వైపు అడుగులు వేశాడు. వివిధ ప్రాంతాల్లో రైతులు పండిస్తున్న పంటలు దిగుబడి గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేశాడు.
Bhukya Bichu got ICAR National Award : వినూత్న పంటల సాగుపై దృష్టిసారించి రైతుల(Telangana Farmers) నుంచి సమాచారం సేకరించాడు బీచ్చు. ఉద్యానశాఖ(Horticulture) అందిస్తున్న రాయితీ విధానాలు తెలుసుకున్నాడు. అవగాహన వచ్చాక తనకున్న13 ఎకరాల భూమిలో కొత్త విధానంలో సాగు ప్రారంభించాడు. ఉద్యానశాఖ ఇచ్చిన 95% రాయితీతో 33 లక్షలు రూపాయలు తీసుకుని ఎకరం స్థలంలో పాలీహౌస్ ఏర్పాటు చేశాడు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి చామంతి మెుక్కలు తెప్పించి నాటారు.
ఈ పరికరంతో కీటకాలకు శిక్ష.. పంటకు శ్రీరామ రక్ష!
వాటిని 90 నుంచి 120 రోజులు అధికారులు పర్యవేక్షణలో వివిధ రంగుల చామంతి పూలు పెంచారు. మార్కెట్‌లో విక్రయించగా 15 లక్షలు ఆదాయం వచ్చిందని అంటున్నాడు. ప్రస్తుతం ఏటా రెండు పంటలు పండిస్తున్నట్లు చెబుతున్నారు. వ్యవసాయం ప్రారంభించిన మెుదట్లో కరోనా కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు బీచ్చు. తర్వాత వాటిని అధిగమించి పూలసాగులో రాణిస్తున్నట్లు చెబుతున్నాడు.