సూర్యాపేట జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సూర్యాపేటలో ఓటేసిన మంత్రి జగదీశ్ రెడ్డి దంపతులు
పట్టభద్రులంతా విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
సూర్యాపేటలో ఓటేసిన మంత్రి జగదీశ్ రెడ్డి దంపతులు
పట్టభద్రులంతా విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సమర్థులకు, సమస్యలు పరిష్కరించగలిగే అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు.
- ఇదీ చూడండి :ఓటు వేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు