సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తన సతీమణి సునీతతో కలిసి పట్టభద్రుల ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గులాబీ శ్రేణులు ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించాయని తెలిపారు.
'అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి'
అర్హత ఉన్న ప్రతి ఒక్కరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తన సతీమణి సునీతతో కలిసి ఓటు నమోదు చేసుకున్నారు.
'అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి'
ఇంటర్ తర్వాత డిగ్రీతో సమానమైన విద్యనభ్యసించిన వారంతా తమ ఓటును నమోదు చేసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డి కోరారు. పట్టభద్రులంతా బాగా ఆలోచించి అభివృద్ధికి బాటలు వేసే అభ్యర్థికి ఓటు వేసి పట్టం కట్టాలని సూచించారు.
- ఇదీ చూడండి:బిహార్ బరి: తొలిరోజు మూడు నామినేషన్లే!