సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలో వివాదాస్పదమైన 540 సర్వే నెంబర్ భూములను తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ పరిశీలించారు. ఈ భూములను గత 70 సంవత్సరాల నుంచి రైతులు సాగు చేసుకుంటున్నా... పట్టాలు ఇవ్వకుండా బడాబాబులకు పట్టాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
ఆ భూములకు పట్టాలివ్వాలి: కోదండరామ్ - telangana janasamithi president kodandaram latest news
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడులో పర్యటించారు. వివాదాస్పదమైన 540 సర్వే నెంబర్ భూములను పరిశీలించారు. ఇక్కడ 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.
ఆ భూములకు పట్టాలివ్వాలి: కోదండరామ్
నాగార్జునసాగర్ ముంపు ప్రాంతమైన గుర్రంపోడు తండా, కృష్ణ తండా, మత్స్య తండా, జోజియా తండాప్రాంతవాసులు ఈ భూములను చదును చేసుకొని పంటలు పండించుకుంటున్నారని చెప్పారు. సర్వే నెంబర్ 540లో రైతులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అవసరమైతే పాదయాత్ర చేయడానికి సిద్ధమన్నారు. కలెక్టర్‌ను కలిసి సమస్య వివరిస్తామని చెప్పారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఇదీ చదవండి:రావిరాలలో మెగా డెయిరీ... ఏర్పాట్లన్నీ పూర్తి: తలసాని