Kodandaram On Telangana Government :సూర్యాపేట జిల్లా కేంద్రంలోతెలంగాణ జన సమితి మూడవ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా టీజేఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. టీజేఎస్ జెండా ఆవిష్కరించిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కి తెలంగాణ పేరును కూడా మార్చుకున్న అధికారపార్టీ బీఆర్ఎస్గా మారిందని కోదండరాం ఆరోపించారు. వారి తక్షణ ఆర్ధిక రాజకీయ ప్రయోజనాల కోసమే తొమ్మిదేళ్లుగా పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
Kodandaram on TJS Merging : ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్న నేపథ్యంలో ఉద్యమ ఆకాంక్షల సాధన, తెలంగాణ పరిరక్షణ కోసం విపక్షాలన్నీ సంఘటితం కావలసిన అవసరం ఉందని కోదండరాం అన్నారు. ఉద్యమ ఆకాంక్షల నేరవేర్చడానికి ఒక వేదిక అవసరం ఏర్పడిందని తెలిపారు. ఇదే సమయంలో టీజేఎస్ ప్లీనరీ ఉండటంతో తెలంగాణ శక్తులను ఐక్యం చేసే వ్యూహ రచనతో పాటుజన సమితికార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తామని వెల్లడించారు.
'తెలంగాణ జన సమితి మూడో ప్లీనరీ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మధ్యలో కొవిడ్ కారణంగా రెండు ప్లీనరీలు జరగలేదు. ఈ ప్లీనరీ చాలా కీలమైన సమయంలో జరుగుతోంది. ఒకవైపు ఎన్నికలు రాబోతున్నాయి. మరోవైపు రాష్ట్ర ఆకాంక్షలను తుంగలో తొక్కి తెలంగాణ పేరును కూడా వదులుకొని అధికారపార్టీ భారత్ రాష్ట్ర సమితిగా మారిన సందర్భం చూస్తున్నాం'. - కోదండరాం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు